Sunday, November 17, 2024

KTR | ఇదిగో మృతుల జాబితా…. ప‌రిహారం చెల్లించాల్సిందే..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : వరదల్లో చిక్కుని మరణించినవారిని కూడా రాష్ట్ర ప్రభుత్వం అబద్దం చేస్తోందని బీఆర్‌ఎస్‌ ఆందోళన వ్యక్తం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 31మంది వరదల్లో చిక్కుని మృత్యు ఒడిలోకి జారుకున్నారని బీఆర్‌ఎస్‌ సర్వేనివేదికలో వెల్లడించింది. మృత్యుల కుటుంబాలకు రూ.25లక్షల ఎక్స్‌ గ్రేషియా ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తూ వరదల్లో మరణించిన వారి జాబితాను బీఆర్‌ఎస్‌ ప్రకటించింది.

ఇందులో కోదాడ ఉత్తమ్‌ పద్మావతి నగర్‌కు చెందిన ఎర్రమల్లు వెంకటేశ్వర్లు బైక్‌పై వస్తుండగా వరదల్లో చిక్కుని మృతి చెందారనీ, మాతానగర్‌లో నాగం రవి, మహబూబ్‌ నగర్‌ లోని గేట్‌ వెంకటపురంలో చేపలవేటకు వెళ్లి నర్సయ్య, డీసీఎంలో కొట్టుకు పోయి నాగభూషణం, ములుగు జిల్లాలోని కాల్వపల్లిలో వాగులో పడి జర్రి పోతుల మల్లికార్జున్‌, నార్లాపూర్‌ గ్రామానికి చెందిన పుట్టమహేష్‌ పిడుగు పడి మరణించారని బీఆర్‌ఎస్‌ తెలిపింది.

వరంగల్‌ జిల్లా మందపల్లిలో కొండ్ర సమ్మక్క, హనుమకొండ జిల్లాలోని పరకాల మున్సిపాలిటీలో గువ్వరాములు, నిర్మల్‌ జిల్లా వానల్‌ పాడ్‌ లో కందం భోజారాం, నారాయణ్‌ పేట్‌ జిల్లాలో ఎక్కమోడి గ్రామంలో హన్మమ్మ, అంజిలమ్మ వర్షాలతో ఇల్లుకూలి మరణించారని బీఆర్‌ఎస్‌ తెలిపింది.

నాగర్‌ కర్నూల్‌ జిల్లాలోని చెర్లతిమ్మాపూర్‌లో వరదల్లో కొట్టుకుపోయి గుర్తు తెలియని వ్యక్తి మృత్యువాత పడ్డారు. వనపర్తి జిల్లా తాటిపాముల గ్రామంలో ఇల్లుకూలి వడ్డే చంద్రయ్య, పెద్దపల్లి జిల్లాలోని మీర్జం పేట లో కూనారం చెరువులో కొట్టుకు పోయి చెప్యాల పవన్‌మృతి చెందారు.

కరీంనగర్‌ మండలం బొమ్మకల్‌ గ్రామంలో గోస్కుల కుమార్‌, కామారెడ్డి జిల్లా లచ్చపేటలో చేపలు పట్టేందుకు వెెళ్లి లక్ష్మన్‌, కొహెడ మండలంలోని రామచంద్రాపురంలో కాలువలో పడి బొప్పల కనకయ్య, ఖమ్మంజిల్లాలో నాయికన్‌ గూడెంలో యాకూబ్‌, సైదాబాద్‌ దెందుకూరులో సాంబశివరావు, పద్మావతి, సునావత్‌ అశ్వని, సనావత్‌ మోతీలాల్‌ మరణించారు. కొత్తగూడెం జిల్లాలోని అశ్వాపురం లో నందికొళ్ల రాములు, మణుగూరులో తాటి ఆదమ్మ, కల్లూరి నీలమయ్య, టేకులపల్లిలో గుర్తు తెలియని వ్యక్తి, రంగారెడ్డి జిల్లాలోని ఫారుఖ్‌ నగర్‌ లో ఎరుకల రాజేష్‌, షాద్‌ నగర్‌ లో బీహార్‌ కు చెందిన అరీఫ్‌ మన్నూరు వరదల్లో కొట్టుకుపోయి మరణించారని బీఆర్‌ఎస్‌ ఆందోళన వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం మృతుల సంఖ్యను తప్పుగా ప్రకటిస్తోందని ఆందోళన వ్యక్తం చేసింది. వరదల్లో మరణించిన 31 మంది జాబితా, చిరునామాలు సిద్ధంగా ఉన్నాయని బీఆర్‌ఎస్‌ తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement