ఇటీవల బెయిల్‌పై విడుదలైన హేమంత్ సోరెన్ ఈరోజు జార్ఖండ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఐదు నెలల తర్వాత, సోరెన్ మళ్లీ జార్ఖండ్ ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. రాంచీలోని రాజ్‌భవన్‌లో హేమంత్ సోరెన్‌తో గవర్నర్ రాధాకృష్ణన్ ప్రమాణం చేయించారు.
మనీలాండరింగ్ ఆరోపణలపై సోరెన్ అరెస్టు కావడంతో 5 నెలలు జైలు జీవితం గడిపారు. తాజాగా ఆయనకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. హేమంత్ సోరెన్ జైలులో ఉండగా, చంపై సోరెన్ జార్ఖండ్ ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. హేమంత్ సోరెన్ జైలు నుంచి విడుదలైన నేపథ్యంలో అధికార జేఎంఎం ఎమ్మెల్యేలు చంపై సోరెన్ నివాసంలో సమావేశమయ్యారు. హేమంత్ సోరెన్‌ను తమ శాసనసభా పక్ష నేతగా ఎన్నుకున్నారు. చంపై సోరెన్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయగా, గవర్నర్ రాధాకృష్ణన్ హేమంత్ సోరెన్‌ను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు.