రష్యా తమపై దాడులు ప్రారంభించి నెల రోజులైందని, తమకు సైనిక సహాయాన్ని అందించాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ విన్నవించారు. గురువారం నాటో దేశాలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ప్రజలు, తమ నగరాలను రక్షించేందుకు ఉక్రెయిన్‌కు ఆంక్షలు లేకుండా సైనిక సాయం అవసరం ఉందన్నారు. అదేవిధంగా రష్యా తన పూర్తి ఆయుధాగారాన్ని తమకు వ్యతిరేకంగా ఆంక్షలు లేకుండా ఉపయోగిస్తోందన్నారు. ఇప్పటి వరకు పాశ్చాత్య సైనిక కూటమి నుంచి రక్షణ పరికరాలు అందాయని, మరింత సాయం ఇస్తే రుణపడి ఉంటామని జెలెన్ స్కీ విన్నవించాడు. నాటో దేశాల వద్ద ఉన్న మొత్తం విమానాలు, ట్యాంకుల్లో కేవలం ఒక శాతం ఇచ్చినా చాలు అంటూ కోరాడు. రష్యా తమపై రసాయనిక దాడికి పాల్పడిందన్నారు. పాస్సరస్‌తో కూడి క్షిపణులు తమ దేశంపై కురిపించిందన్నారు.
ఈ పాస్పరస్ కారణంగా మారణహోం చాలా ఉంటుందని, ఈ తరహా వెపన్స్ వాడటంతో.. ఎంతో ప్రమాదకరమన్నారు. ఈ పాస్పరస్.. గాల్లోని ఆక్సిజన్‌తో కలిసి.. మండుతుందన్నారు. గురువారం ఉదయం కూడా పాస్పరస్ బాంబులతో కూడిన దాడులు చేసిందని ఆరోపించారు. ఈ దాడుల్లో పలువురు చనిపోయారని, ఇందులో చిన్నారులు కూడా ఉన్నారని జెలెన్ స్కీ చెప్పుకొచ్చారు. రష్యా దాడుల నుంచి.. రష్యా ఆక్రమణ నుంచి.. తమకు అవసరమైన అన్ని ఆయుధాలను అందించడం ద్వారా.. ఉక్రెయినియన్‌ల మరణాలు నిలువరించొచ్చని తెలిపారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..