తెలంగాణ వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వానికి ప్రతి ఒక్కరూ అండగా నిలబడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. స్వచ్చంద సంస్థలు, కార్పొరేట్ కంపెనీలు, ఇతర రంగాల్లోని ప్రముఖులు స్పందించాలని కోరారు. “వరద బాధితులను ఆదుకోవడానికి చేతనైనంత సహాయాన్ని అందించండి. మానవత్వం ప్రదర్శించాల్సిన సమయమిది” అని రేవంత్ రెడ్డి అన్నారు.
ఈ మేరకు తెలంగాణ సీఎంఓ ఎక్స్ వేదికగి… క్యూఆర్ కోడ్ ఒక పోస్ట్ చేసింది. తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలను చెక్కుల రూపంలో లేదా ఈ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి ఆన్‌లైన్ బ్యాంకింగ్, యూపీఐ పేమెంట్ యాప్స్ ద్వారా పంపవచ్చు అన స్పష్టం చేసింది.
ఇక కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ సీఎస్ఆర్ కింద విరాళాలు అందించే సంస్థలు కింద ఇచ్చిన రెండో క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లింపులు జరపవచ్చని పేర్కొంది.