సంస్కారంతో మర్యాదగా మాట్లాడటం గొప్ప వ్యక్తిత్వం. సమాజంలో మంచి జీవితాన్ని గడపటానికి ఈ వ్యక్తిత్వం ఎంతగానో ఉపయోగపడుతుంది. మీరు సంస్కారవంతులని, మర్యాదస్తులని గుర్తించాలని ఆరాటపడుతున్నారా ? అందుకు తగిన బహుమానం ఆశిస్తున్నారా ? అయితే, అలాంటి వారి కోసమే యుకెలో ఒక కాఫీ కేఫ్ ఎదురు చూస్తోంది. కేఫ్ సిబ్బందితో మర్యాదగా మాట్లాడే కస్టమర్‌కు చాయ్ రేటులో డిస్కౌంట్ లభిస్తుంది. పైగా ఎంత ఎక్కువ మర్యాదగా మాట్లాడితే, ఆ కేఫ్‌లోని చాయ్‌పై కస్టమర్లకు అంత ఎక్కువ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ కేఫ్ యునైటెడ్ కింగ్డమ్లో ఉంది. లాన్కాషైర్లో ఇటీవలే చాయ్ స్టాప్ కేఫ్ ప్రారంభమైంది. ఈ చాయ్ స్టాప్‌కు వచ్చిన కస్టమర్లు, ఆర్డర్ చేసేటప్పుడు హలో, ప్లీజ్ వంటి పదాలను ఉపయోగిస్తే వారికి భారీ డిస్కౌంట్ లభిస్తుంది.
ఆ చాయ్ స్టాప్‌లో దేసీ చాయ్ అని అడిగితే 5 డాలర్లు చెల్లించాలి. దేసీ చాయ్ ప్లీజ్ అని అడిగితే 3 డాలర్లు, హలో దేసీ చాయ్ ప్లీజ్ 1.90 డాలర్లు చెల్లిస్తే చాలని కేఫ్ యజమాని ఉస్మాన్ హుస్సేన్ ప్రకటించారు. అమెరికన్ కేఫ్‌లో పొలైట్‌నెస్ రూల్ ప్రభావంతో ఈ మార్చిలో స్పెషల్ మెనూ టీ ప్రవేశపెట్టినట్లు హుస్సేన్ వెల్లడించారు. స్ట్రీట్ఫుట్, డిజెర్ట్స్ ద్వారా ప్రజల మధ్య ప్రేమ, పొలైట్‌నెస్ వృద్ధి చేయాలన్నది తన లక్ష్యమని ఆయన ప్రకటించారు. చాయ్ స్టాప్ మెనూను హుస్సేన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది.