భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపందాల్చి ప్రవహిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే సీఎం కేసీఆర్ ఆదేశాలతో వరద ముంపు ప్రాంతాల్లో అన్ని రకాలుగా సహాయక, రక్షణ చర్యలను క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగంతో కలిసి ప్రజలను రక్షించే ప్రయత్నంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ భాగస్వాములవుతున్నారు. ఈ నేపథ్యంలో భద్రాచలానికి సహాయక చర్యలు కొరకు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అభ్యర్థన మేరకు హెలికాప్టర్ ను అందుబాటులో ఉంచాలని సీఎం కేసీఆర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ను ఆదేశించారు. దీంతో శనివారం మధ్యాహ్నం హెలికాప్టర్ భద్రాచలం ముంపు ప్రాంతాల్లో అందుబాటులో ఉంది. హెలీకాప్టర్ తో పాటు వరద బాధితులను రక్షించేందుకు, సహాయ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఉపయోగపడే లైఫ్ జాకెట్లు, తదితర రక్షణ సామగ్రిని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ విజ్ఞప్తి మేరకు తరలించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement