Friday, September 20, 2024

Nepal | కుప్పకూలిన హెలికాప్టర్.. ఐదుగురు దుర్మరణం

నేపాల్‌లోని నువాకోట్ జిల్లా శివపురి ప్రాంతంలో హెలికాప్టర్ కుప్పకూలింది. నేపాల్ రాజధాని ఖాట్మండు నుంచి రాసువాకు వెళ్తుండగా నువాకోట్ జిల్లాలోని సూర్య చౌర్-7 వద్ద ఎయిర్ డైనాస్టీ హెలికాప్టర్ కొండను ఢీకొట్టి కూలిపోయిందని అధికారులు ప్రకటించారు. త్రిభువన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నుంచి టేకాఫ్ అయిన 3 నిమిషాలకే ఎయిర్ డైనాస్టీ హెలికాప్టర్ గ్రౌండ్ కంట్రోల్‌తో సంబంధాలు తెగిపోయినట్లు అధికారులు తెలిపారు.

ప్రమాదానికి గురైన ఎయిర్ డైనాస్టీ హెలికాప్టర్‌కు సీనియర్ కెప్టెన్ అరుణ్ మల్లా పైలట్ అని అధికారులు వెల్లడించారు. కాగా, హెలికాప్టర్‌లో మరో నలుగురు చైనా పౌరులు ఉండగా, కొండను ఢీకొనడంతో పైలట్‌తో సహా ఐదుగురు అక్కడికక్కడే మరణించినట్లు అధికారులు ప్రకటించారు. ప్రమాద సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు, సహాయక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement