Friday, November 22, 2024

టోల్ ఫీజు కట్టలేక సొంతంగా రోడ్డు వేసుకున్న గ్రామస్తులు

కర్ణాటక ఉడుపి జిల్లాలోని హేజ్‌మాడి గ్రామం జాతీయ రహదారికి పక్కనే ఉంటుంది. దీంతో ఆ గ్రామానికి చెందిన వాహనాలు రాకపోకలు సాగించాలంటే ప్రతిసారీ టోల్​ ఛార్జీ చెల్లించాల్సిందే. ఈ భారం నుంచి తప్పించుకునేందుకు అక్కడి ప్రజలు చేసిన పని సర్వత్రా చర్చనీయాంశమైంది. టోల్ ఛార్జీల బాదుడు భరించలేక టోల్ ఫీజును తప్పించుకునేందుకు హేజ్‌మాడి ప్రజలు జాతీయ రహదారికి సమాంతరంగా రోడ్డు నిర్మించాలని నిర్ణయించారు. అనుకున్నదే తడవుగా పనులు ప్రారంభించారు. మార్చి 30 నాటికి రోడ్డు నిర్మాణం పూర్తి చేశారు. ఆ ఊరి వాహనాలన్నీ కొత్త రోడ్డు ద్వారా ప్రయాణాలు సాగించడం ప్రారంభించాయి.

అయితే గతంలో తమ వాహనాలకు మినహాయింపు ఇవ్వాలని.. అధికారులను ఆ గ్రామ ప్రజలు ఎన్నోసార్లు విజ్ఞప్తి చేశారు. అయినా ఎవరూ పట్టించుకోలేదు. రోడ్డు వేయడంతో సంబంధిత కాంట్రాక్టర్లు దిగొచ్చి ఎట్టకేలకు టోల్ ఛార్జీల నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఆయా గ్రామానికి చెందిన వాహనాల వివరాలను నమోదు చేయించుకోవాలని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement