Tuesday, November 26, 2024

TG | జూన్ 2న భారీగా ట్రాఫిక్ మళ్లింపులు.. ట్రాఫిక్ ఆంక్షలివే

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి జూన్ 2వ తేదీకి పదేళ్లు పూర్తవుతున్న‌ సందర్భంగా ప్రభుత్వం పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా నగరంలోని కొన్ని ప్రాంతాల్లో రాష్ట్ర ఆవిర్భావ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాల్గొంటుండడంతో ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను మళ్లించనున్నారు. తెలంగాణ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల కారణంగా జూన్ 2న గన్ పార్క్, నాంపల్లి, పరేడ్ గ్రౌండ్స్‌లో ట్రాఫిక్‌ను మళ్లిస్తున్నట్లు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు.

గన్ పార్క్ వద్ద (ఉదయం 9 నుంచి 10 గంటల మధ్య మళ్లింపులు)

రవీంద్ర భారతి జంక్షన్ వద్ద సైఫాబాద్ ఓల్డ్ పీఎస్ నుంచి HTP వైపు వెళ్లే ట్రాఫిక్ ను ఇక్బాల్ మినార్ జంక్షన్ వైపు మళ్లిస్తారు.

ఏఆర్ పెట్రోల్ పంప్ – నాంపల్లి టీ జంక్షన్ నుంచి రవీంద్ర భారతి వైపు వచ్చే ట్రాఫిక్ ను ఏఆర్ పెట్రోల్ పంప్ వద్ద మళ్లించి బీజేఆర్ విగ్రహం వైపునకు పంపిస్తారు.

ఈ ప్రాంతాల్లోకి ట్రాఫిక్ నిషేధం (జూన్ 2 ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు)

- Advertisement -

వాహనదారులు పంజాగుట్ట – గ్రీన్‌ల్యాండ్స్ – బేగంపేట నుంచి సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్, పరేడ్ గ్రౌండ్ చుట్టుపక్కల రోడ్ల వైపు రాకుండా ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. టివోలి ఎక్స్ రోడ్స్ నుండి ప్లాజా ఎక్స్-రోడ్స్ మధ్య రహదారి కూడా మూసివేసి ఉంటుంది.

చిలకలగూడ ఎక్స్ రోడ్స్, ఆలుగద్బై ఎక్స్ రోడ్స్, సంగీత్ ఎక్స్ రోడ్స్, వైఎంసిఎ ఎక్స్ రోడ్స్, (5) ప్యాట్నీ ఎక్స్ రోడ్స్, ఎస్‌బిహెచ్ ఎక్స్ రోడ్స్, ప్లాజా, సిటిఓ జంక్షన్, బ్రూక్‌బాండ్ జంక్షన్, టివోలి జంక్షన్, స్వీకర్ ఉపకార్ జంక్షన్, సికింద్రాబాద్ క్లబ్, త్రిముల్ఘేరి ఎక్స్ రోడ్లు ఎక్స్ రోడ్స్, సెంటర్ పాయింట్, డైమండ్ పాయింట్, బోవెన్‌పల్లి ఎక్స్ రోడ్స్, రసూల్‌పురా, బేగంపేట, ప్యారడైజ్ ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను అనుమతించబోమని ట్రాఫిక్ పోలీసులు ప్రకటన విడుదల చేశారు.

రైల్వే స్టేషన్ లేదా బస్ స్టేషన్ లకు చేరుకోవాల్సిన వారు మెట్రో రైలు సర్వీసును ఉపయోగించుకోవాల్సిందిగా ట్రాఫిక్ పోలీసులు సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement