హైదరాబాద్, ఆంధ్రప్రభ బ్యూరో : రాష్ట్రంలో రాగల మూడు రోజులపాలు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈశాన్య, ఉత్తర తెలంగాణ జిల్లాలకు మూడు రోజులపాటు రెడ్ అలర్ట్ హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే ఈ సీజన్‌లో సగటు వర్షపాతం కంటే అత్యధికంగా నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్‌లో మోస్తరు వర్షాలతో పాటు గట్టి జల్లులు పడే అవకాశముందని తెలిపింది.
రాగల నాలుగైదు వారాల పాటు వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని పేర్కొంది. ఎగువ నుంచి గోదావరి నదిలోకి భారీగా వరద వచ్చే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో వర్షాలు పడతాయని హైదరాబాద్ పరిసర జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశముందని తెలిపింది. నిజామాబాద్ జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదైందని స్పష్టం చేసింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.