హైదరాబాద్, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో మరో మూడు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ రోజు (మంగళవారం) రాత్రి నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ద్రోణి ప్రభావంతో భారీ వానలు కురుస్తాయని వెల్లడించింది. బుధవారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, గురువారం తేలిక పాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లరాదని సూచించింది.
పది జిల్లాలకు రెడ్ అలర్ట్, మరో 14 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్‌ను వాతావరణ శాఖ ప్రకటించింది. తెలంగాణలోని పలు జిల్లాల్లో చెరువులు అలుగు పారుతూ రహదారిపై నీరు చేరి రాకపోకలు నిలిచిపోయాయని, మరికొన్ని ప్రాంతాల్లో వంతెనలపై నుంచి నీరు పారుతోందని స్థానిక ప్రజలు, వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని ఆయా జిల్లాల యంత్రాంగం హెచ్చరించింది. చాలా గ్రామాల్లో వాగులు, చెరువులు పొంగి పొర్లుతున్నాయని చెప్పింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.