తిరుమల బ్రహ్మోత్సవాలకు వచ్చేసే భక్తులకు భారీ భద్రత ఏర్పాటు చేశారు. భక్తులకు మూడంచెల భద్రతా విధానాన్ని అవలంభిస్తున్నామని టీటీడీ సీవీఎస్వో నరసింహ కిషోర్ తెలిపారు. అసాంఘిక శక్తుల నుంచి భక్తులకు పటిష్టమైన భద్రత కల్పిస్తున్నామని, ప్రతి ఒక్కరినీ క్షుణ్ణంగా తనిఖీ చేసిన తరువాతే అనుమతిస్తామని తెలిపారు. మొదటి దశలో అలిపిరి చెక్ పాయింట్ వద్ద, రెండో దశలో శ్రీవారి ఆలయంలోకి ప్రవేశించే ముందు, మూడో దశలో మాడ వీధుల్లోకి అనుమతించే ముందు తనిఖీలు చేపడతామన్నారు. తిరుమలలో 2200 సీసీ కెమెరాల ద్వారా భద్రతను పర్యవేక్షిస్తున్నామని, మూడో దశలో 1500 సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. దశలవారీగా ఘాట్ రోడ్లను కూడా సీసీ కెమెరాల ద్వారా కవర్ చేస్తామన్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో దొంగ తనాలు జరగకుండా చూసేందుకు, శాంతిభద్రతలను అదుపు చేసేందుకు టీటీడీ విజిలెన్స్ సిబ్బందితో పాటు ప్రత్యేక స్క్వాడ్‌లు, 460 మంది ఎస్‌పిఎఫ్ సిబ్బంది కలిపి 5000 మంది బలగాలను మోహరిస్తున్నట్లు చెప్పారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement