Sunday, November 24, 2024

కురుస్తున్న భారీ వర్షాలు, విస్తరిస్తున్న డయేరియా.. హైదరాబాద్‌లోనే అత్యధిక కేసులు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : కరోనా వైరస్‌, డెంగీ, మలేరియాతోపాటు డయేరియా (వాంతులు విరోచనాలు) కూడా రాష్ట్ర ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. మరీ ముఖ్యంగా గడిచిన నెల రోజులుగా రాష్ట్రంలో డయేరియా కేసులు పెరిగిపోతున్నాయి. భారీ వర్షాలకు తాగునీరు కలుషితమవడమే ఇందుకు కారణమని వైద్యులు చెబుతున్నారు. గడిచిన రెండు నెలల్లోనే 12650 డయేరియా కేసులు రాష్ట్ర వ్యాప్తంగా రికార్డయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మొదలు పెద్దాసుపత్రుల వరకు డయేరియా పేషెంట్లు ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పోలిస్తే హైదరాబాద్‌లో అత్యధికంగా డయేరియా కేసులు నమోదవుతున్నాయి. అతి తక్కువగా వరంగల్‌ జిల్లాలో వెలుగు చూశాయి.

జాగ్రత్తలు అవసరం…
డయేరియా విస్తరిస్తున్న నేపథ్యంలో ఈ వర్షాకాలంలో కాచి చల్లార్చి వడబోసిన మంచినీటినే తాగాలని, వాంతులు విరోచనాలు అయితే ఓఆర్‌ఎస్‌ పౌడర్‌ను నీళ్లలో కలిపి తాగాలని, కొబ్బరినీల్లు, పళ్ల రసాలను తీసుకోవాలని, పరిశుభ్రమైన, వేడి ఆహార పదర్థాలను మాత్రమే భుజించాలని వైద్యులు సూచిస్తున్నారు. తీవ్రస్థాయిలో వాంతులు విరేచనాలు అవుతుంటే ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించాలని సూచిస్తున్నారు. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ప్రమాదమని హెచ్చరిస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement