Monday, July 1, 2024

Heavy Rains – ఢిల్లీలో వ‌ర్ష బీభ‌త్సం…ఏడుగురు మృతి..

ఢిల్లీలో గ‌త 24 గంట‌ల‌లె కురిసిన వర్షం విధ్వంసం సృష్టించింది. కానీ ఆకాశం నుండి కురుస్తున్న వర్షం ఇంత విపత్తు సృష్టిస్తుందని వాళ్లు ఊహించి ఉండరు. గురువారం అర్థరాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు కురిసిన వర్షం 44 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టింది. దీని కారణంగా కనీసం ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. బస్సులు, ట్రక్కులు కూడా నీటిలో మునిగిపోయేలా పరిస్థితి నెలకొంది. అనంతరం రెస్క్యూ టీం ఘటనా స్థలానికి చేరుకుని ప్రజలను సురక్షితంగా తరలించారు. నాలుగు వేర్వేరు సంఘటనలలో కనీసం ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇందులో 8, 10 ఏళ్ల ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. ఈ చిన్నారులిద్దరూ ఆడుకుంటూ నీటిలో మునిగి చనిపోయారని చెబుతున్నారు. మరో సంఘటనలో అండర్‌పాస్‌లో వర్షం నీటిలో మునిగి వృద్ధుడు మరణించాడు.

వసంత్ విహార్‌లో ముగ్గురు కూలీలు కూడా మరణించారు. వాస్తవానికి, భారీ వర్షాల కారణంగా వసంత్ విహార్‌లో నిర్మాణంలో ఉన్న గోడ కూలిపోయింది. దీని కారణంగా ముగ్గురు కార్మికులు శిథిలాలలో చిక్కుకుని మరణించారు. రెస్క్యూ టీం ముగ్గురు కూలీల మృతదేహాలను బయటకు తీశారు. అంతేకాకుండా భారీ వర్షాల కారణంగా ఢిల్లీ విమానాశ్రయం టెర్మినల్-1 పైకప్పులో ఒక భాగం కూలిపోవడంతో ఒకరు మరణించారు.

- Advertisement -

నీటిలో ప‌లు ప్రాంతాలు ..
కాగా, భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. న్యూ ఉస్మాన్‌పూర్ ప్రాంతంలో కూడా నీటి ఎద్దడితో ప్రజలు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఈ సమయంలో ప్రజల ఇళ్లు నీటమునిగి, వాహనాలు నీట మునిగాయి. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడి గంటల తరబడి నిలిచిపోయింది. వేలాది మంది ప్రయాణికులు తమ కార్యాలయాలకు, ఇతర పనులకు వెళ్లలేక రోడ్లపైనే నిలిచిపోయారు. వర్షం కారణంగా ప్రగతి మైదాన్‌ సొరంగమార్గాన్ని మూసివేశారు. ఇది కాకుండా, లుట్యెన్స్ ఢిల్లీ, హౌజ్ ఖాస్, సౌత్ ఎక్స్‌టెన్షన్, మయూర్ విహార్ వంటి నాగరిక ప్రాంతాలతో సహా నగరంలోని ఇళ్లలో నీరు నిలిచిపోయినట్లు నివేదికలు వచ్చాయి. ఢిల్లీ ప్రాథమిక వాతావరణ కేంద్రమైన సఫ్దర్‌జంగ్ అబ్జర్వేటరీలో 24 గంటల్లో 228.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇది జూన్ సగటు వర్షపాతం 74.1 మిమీ కంటే మూడు రెట్లు ఎక్కువ. 1936 తర్వాత 88 ఏళ్లలో ఈ నెలలో ఇదే అత్యధిక వర్షపాతం.

Advertisement

తాజా వార్తలు

Advertisement