హైదరాబాద్, ఆంధ్రప్రభ : భారీ వర్షాల నేప థ్యంలో ఉస్మానియా ఆసుపత్రి రోగులు, వైద్య సిబ్బందికి ప్రాణభయం పట్టుకుంది. ఎక్కడ , ఎప్పుడు ఎటు నుంచి పై కప్పు కూలి మీద పడుతుందోనన్న భయంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఏ సమయంలో ఏ ఫ్యాన్ వచ్చి తల మీద పడుతుందోనన్న భయం రోగులతోపాటు వైద్యులను వెంటాడుతోంది. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఉస్మానియా ఆసుపత్రి ఐసీయూలో పైకప్పు పెచ్చులూడిపోతున్నాయి. సీలింగ్ నుంచి వాటర్ లీకేజీతోపాటు ఓపీ రిజిస్ట్రేషన్ బ్లాక్ వద్ద సీలింగ్ ఊడి పడింది.
ఆ సమయంలో రోగులు, వైద్య సిబ్బంది లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఉస్మానియా ఆసుపత్రిలో ఐసీయూ వార్డును 40 పడకలతో 3 నెలల క్రితమే రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖా మంత్రి హరీష్‌రావు ప్రారంభించారు. ప్రారంభించిన కొద్ది రోజులకే ఐసీయూ వార్డు పెచ్చులూడడంతో ఉస్మానియాలో రోగులు, వైద్యులు, సిబ్బంది భద్రతపై నీలినీడలు కమ్ముకున్నాయి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.