Friday, September 20, 2024

Trains canceled | భారీ వ‌ర్షాలు.. మరిన్ని రైళ్లు రద్దు !

ఏపీ, తెలంగాణ‌ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు మ‌రిన్ని రైళ్ల‌ను ర‌ద్దు చేస్తూ అధికారులు ప్ర‌క‌టించారు. ఇప్పటికే 30కి పైగా రైళ్లను రద్దు చేసిన అధికారులు.. తాజాగా ఆదివారం, సోమవారం కలిపి మొత్తం 80 రైళ్లు రద్దు చేశారు. మరో 48 రైళ్లను దారి మళ్లించారు.

హైదరాబాద్‌- విజయవాడ రూట్‌లోనే అత్యధిక రైళ్లు రద్దయ్యాయి. ట్రాక్‌లు కొట్టుకుపోవడంతో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కాజీపేట, రాయనపాడులో ట్రాక్‌లు తెగిపోవడంతో రైళ్లు నిలిపివేశారు.

మరోవైపు పలు ప్రాంతాలకు వెళ్లే రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. కాకినాడ – తిరుపతికి వెళ్లే కాకినాడ పోర్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ను రాజమండ్రిలో నిలిపివేసి, రైలును రద్దు చేశారు. విశాఖపట్నం – కడప వెళ్లే తిరుమల ఎక్స్‌ప్రెస్‌ను కూడా రద్దు చేశారు. విశాఖపట్నం – విజయవాడ వస్తున్న రత్నాచల్‌ ఎక్స్‌ప్రెస్‌ను భీమవరం మీదుగా దారి మళ్లించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement