Thursday, November 21, 2024

భారీ వ‌ర్షాలు- జ‌న్మ‌దిన వేడుక‌ల‌కు దూరంగా ఉండాల‌ని మంత్రి కేటీఆర్ పిలుపు

రాష్ట్ర వ్యాప్తంగా భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. కాగా రేపు మంత్రి కేటీఆర్ పుట్టిన‌రోజు. కేటీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించాలని పార్టీ శ్రేణులు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నాయి. మరోవైపు కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. జన్మదిన వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు ఆయన ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జన్మదిన వేడుకలకు తాను దూరంగా ఉంటున్నట్టు ఆయన తెలిపారు. వరదల వల్ల పలు జిల్లాల్లో ప్రజలు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో పార్టీ శ్రేణులు తమకు తోచిన మేరకు ‘గిఫ్ట్ ఏ స్మైల్’ కార్యక్రమం కింద సహాయం చేయాలని… పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు జన్మదిన సంబరాలకు బదులు స్థానికంగా ఉన్న ప్రజలకు సహాయం చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement