Friday, November 22, 2024

Heavy rain : తమిళనాడును ముంచేత్తుతున్న వర్షాలు

తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుఫాను ప్రభావంతో తమిళనాడును ముంచేత్తుతున్నాయి. గత మూడు,నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలు రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలలో జన జీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. వర్షాల కారణంగా తమిళనాడులో 10 జిల్లాలకు ఆరంజ్ అలర్ట్ విడుదల చేశారు.

చెన్నై, కన్యాకుమారి, కడలూరు సహా పది జిల్లాలకు వాతావరణ శాఖ ఆరంజ్ అలర్ట్ ప్రకటించింది. ఇక నీలగిరిలో కొండ చరియలు విరిగిపడ్డాయి.దీంతో.. ఊటీకి వెళ్లే వాహనాలు, రైళ్లను తాత్కాలికంగా రద్దు చేశారు. కొండచరియలు విరిగిపడి పట్టాలపై పెద్దపెద్ద బండరాళ్లు పడిపోయాయి. వీటిని సిబ్బంది తొలగిస్తున్నారు. వర్షాల కారణంగా దక్షిణ తమిళనాడులో భారీగా పంట నష్టం వాటిల్లింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement