ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లో వర్షాలు భీభత్సం సృష్టిస్తున్నాయి. జూన్ 14వ తేదీ నుంచి ఇప్పటి వరకు వర్షాల వల్ల జరిగిన ప్రమాదాల్లో సుమారు 165 మంది మరణించారు. మరో 171 మంది గాయపడినట్లు నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ పేర్కొంది. బలోచిస్తాన్ ప్రావిన్సులో పరిస్థితి దారుణంగా ఉంది. వర్షాల వల్ల ఆ రాష్ట్రంలో 65 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 49 మంది గాయపడ్డారు. అనేక ప్రాంతాల్లో డ్యామ్‌లు తెగినట్లు నివేదికలు అందాయి. వందల సంఖ్యలో ఇండ్లు కొట్టుకుపోయాయి. బలోచిస్తాన్ ప్రావిన్సులో 144వ సెక్షన్ విధించారు.
నదులు, డ్యామ్‌లు, రిజర్వాయర్ల వద్ద పిక్‌నిక్‌లను నిషేధించారు. సింధూ ప్రావిన్సులో భారీ వానల వల్ల 38 మంది ప్రాణాలు కోల్పోయారు. అప్ఘనిస్తాన్‌లో ఆకస్మిక వరదలు వచ్చాయి. దీనివల్ల వివిధ ప్రదేశాల్లో 39 మంది ప్రాణాలు కోల్పోయారు. జులై ఐదో తేదీ నుంచి నమోదు అయిన వర్షాల వల్ల ఈ ప్రాణ నష్టం జరినట్టు అధికారులు చెప్పారు.