Tuesday, November 26, 2024

భారీ వర్షానికి జలమయమైన దేశ రాజధాని ఢిల్లీ

ఢిల్లీలో మంగళవారం భారీ వర్షం పడింది. దీంతో ఢిల్లీలోని చాలా ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. సెంట్రల్ ప్రగతి మైదానం, ధౌలా కువాన్ మధుర రోడ్, మోతీ బాగ్, వికాస్ మార్గ్, రింగ్ రోడ్, రోహ్తక్ రోడ్, సంగం విహార్, కిరారీ ప్రాంతాల్లో రోడ్లపై భారీగా నీరు నిలిచింది. ఈ క్రమంలో ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలిగింది.

వర్షం ప్రభావం అధికంగా ఉన్న ప్రాంతాల్లో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. గత 24 గంటల్లో సఫ్దర్‌జంగ్ అబ్జర్వేటరీలో వంద మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఢిల్లీలో మంగళవారం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురువడంతో పాటు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. మళ్లీ భారీ వర్షం పడే అవకాశం ఉన్నందున ఢిల్లీలోని లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

ఈ వార్త కూడా చదవండి: శ్రీశైలం డ్యాంకు భారీగా వరదనీరు

Advertisement

తాజా వార్తలు

Advertisement