ముంబాయిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే నగరంలోని రోడ్లు, రైల్వేస్టేషన్ లు నీటమునిగాయి. నగరంలోని కొన్ని రూట్లలో రైలు, బస్సు సర్వీసులపై ప్రభావం పడింది. లోతట్టు ప్రాంతాలు, రైల్వే ట్రాక్‌లు మునిగిపోవడంతో ట్రాఫిక్ నిలిచిపోతోంది. ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. దీంతో అక్కడ అధికారులు అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టారు. అయితే ఇవాళ కూడా ముంబైలో వర్షాలు కురుస్తున్నాయి. దీంతో సాధారణ జనజీవినం స్తంభించిపోయింది.
శుక్రవారం వరకు ముంబైతో పాటు శివారు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే అవకాశాలు ఉన్నట్లు వాతావరణశాఖ హెచ్చరించిన విషయం తెలిసిందే. సోమవారం నుంచి వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. కొన్ని నదుల్లో నీటి స్థాయి పెరుగుతూనే ఉంది. రాయిగడ్, రత్నగిరి జిల్లాలకు రెడ్, ఆరెంజ్ హెచ్చరికలను జారీ చేశారు. తగిన చర్యలు తీసుకోవాలని సీఎం ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.