Sunday, October 6, 2024

Heavy Rains – మ‌ళ్లీ కుమ్మేసిన వ‌ర్షం.. ముగినిగిన ముంబై

జ‌న‌జీవ‌నం అతలాకుత‌లం
స్థంభించిన రవాణ‌..నిలిచిన లోకల్ ట్రైన్స్
మెట్రోకు అంత‌రాయం
విద్యా సంస్థ‌ల‌కు సెల‌వులు

దేశ వాణిజ్య రాజధాని ముంబైని భారీ వర్షాలు ముంచెత్తాయి. ఆరు గంటల పాటు ఏకధాటిగా కుంభవృ ష్టి కురవగా రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. దీంతో నగరంలో జనజీవనం స్తంభించింది. లోతట్టు ప్రాం తాలు జలమయమ య్యాయి. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత నుంచి సోమవారం ఉదయం 7 గంటల వరకు ముంబయి వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. దీంతో 300 మిల్లీమీటర్లకు పైగా వర్ష పాతం నమోదైంది. అత్యధికంగా గోవండి ప్రాంతంలో 315 మి.మి., పోవాయ్‌లో 314 మిల్లీ మీటర్ల వర్షం కురిసినట్లు అధికారులు వెల్లడించారు. వర్షం కారణంగా సెంట్రల్‌ రైల్వే సబర్బన్‌ సర్వీసులకు అంతరాయం ఏర్పడింది.

- Advertisement -

పట్టాలు మునిగిపోవడంతో చాలా లోకల్‌ రైళ్ల రాకపోక లు నిలిచిపోయాయి. కొన్ని ఆలస్యంగా నడుస్తున్నాయి. ముంబై, ఠాణె, పాల్ఘర్‌, రాయ్‌గడ్‌లో ప్రతిరోజు దాదాపు 30లక్షల మంది సబర్బన్‌ లోకల్‌ రైలు సేవలను వినియోగించు కుంటారు. వర్షం కారణంగా ముంబ యిలోని అనేక లోతట్టు ప్రాంతాలు నీట మునిగా యి. పలు రహదారులపై మోకాలి లోతు నీరు రావడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. పలుచోట్ల ట్రాఫిక్‌జామ్‌ కొనసాగుతోంది.

అటు స్కూళ్లు, కాలేజీలకు నేడు సెలవు ప్రకటించారు. ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది రంగం లోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. నేడు కూడా ముంబైలో భారీ నుంచి అతిభారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికా రులు అంచనా వేశారు. ముంబయితో పాటు ఠాణె, పాల్ఘర్‌, కొంకణ్‌ బెల్ట్‌కు ఐఎండీ ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది. ఇక నిన్న ఠాణెలోని షాపూర్‌ ప్రాంతంలో ఓ రిసార్టును వరద నీరు చుట్టుముట్టగా.. అందులో చిక్కుకున్న 49 మందికి పైగా పర్యటకులను ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. పాల్ఘార్‌ జిల్లాలో పొలంలో పనిచేస్తూ వరదలో చిక్కుకున్న 16 మంది గ్రామస్థులను అగ్నిమాపక సిబ్బంది, ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు రక్షించాయి….

Advertisement

తాజా వార్తలు

Advertisement