హైదరాబాద్, ఆంధ్రప్రభ: మాండౌస్ తుఫాన్ ప్రభావంతో రాగల రెండు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురవనున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. సైక్లోన్ కారణంగా మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిశాయి. ఆకాశం మేఘావృతం కావడంతోపాటు చలిగాలు వీచాయి. ఇదే పరిస్థితి మరో రెండు రోజుల కొనసాగనుంది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ వ్యాప్తంగాభారీ వర్షాలు కురుస్తున్నాయి.
వర్షం కారణంగా హైదరాబాద్ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలు చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ జామ్ ఏర్పడటంతో పోలీసులు క్రమబద్దీకరించారు. లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు చేరింది. ఆదివారం రాత్రి, సోమ, మంగళవారాల్లో తెల్లవారుజామున నగరంలో వర్షం కురిసింది.