Tuesday, November 26, 2024

హైదరాబాద్‌లో దంచికొట్టిన వాన.. వచ్చే మూడు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : హైదరాబాద్‌ జంట నగరాల్లో సోమవారం భారీ వర్షం కురిసింది. దీంతో నగర వాసులు ఇబ్బందులు పడ్డారు. జంట నగరాల్లోని అన్ని ప్రాంతాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. వర్షం దంచికొట్టడంతో పలు ప్రాంతాల్లో రహదారులు నీట మునిగాయి. కోఠి, బేగంబజార్‌, సుల్తాన్‌బజార్‌, ఆబిడ్స్‌, నాంపల్లి, నారాయణగూడ, బషీర్‌బాగ్‌, హిమానత్‌నగర్‌ ప్రాంతాల్లో ఏకధాటిగా కురిసిన వర్షానికి వరద నీరు రావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పలుచోట్ల ఈదురు గాలులతో కూడిన ఓ మోస్తరు వర్షం కురిసిందని వాతావరణశాఖ తెలిపింది.

రహదారులపై వర్షం నీరు పొంగిపొర్లడంతో పలుచోట్ల ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. రాష్ట్రంలో రాబోయే మూడు రోజులపాటు కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురుస్తుందని వాతావరణ కేంద్రం తెలిపింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement