బిహార్‌లో అకాలవర్షాలు బీభత్సం సృష్టించాయి. ఈదురుగాలులు, మెరుపులతో రాష్ట్రవ్యాప్తంగా కురిసిన భారీ వర్షం ధాటికి 27మంది మృతిచెందారు. భారీ వర్షాలు, వాతావరణ పరిస్థితుల కారణంగా పలు రైళ్లు రద్దు కాగా.. విమాన సర్వీసులు కూడా రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. భారీ వర్షాలకు పలు జిల్లాల్లో జనజీవనం స్తంభించిందని అధికారులు తెలిపారు. పాట్నా నుంచి భాగల్‌పూర్ ర#హదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పాట్నాలోని రతన్ తోలాలో ఇసుకను తీసుకెళ్తున్న మూడు పడవలు నదిలో మునిగిపోయాయని అధికారులు తెలిపారు. బోటులో ఉన్న వారంతా ఈదుకుంటూ బయటకు వచ్చారని వెల్లడించారు. తుపాను ప్రభావం విద్యుత్, సమాచార వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడింది. ఖాదియాలోని బీఎస్‌ఎన్‌ఎల్ టవర్ కూలిపోగా… పలు జిల్లాల్లో మొబైల్ టవర్లలో సాంకేతిక లోపం తలెత్తినట్లు తెలుస్తోంది. ఈదురుగాలులకు చెట్లు కూలడం, స్తంభాలు విరిగిపోవడంతో విద్యుత్తు సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మరో రెండురోజులపాటు వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు తెలిపారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..