Tuesday, October 22, 2024

Heavy Rains – బెంగళూరులో మళ్లీ కుండపోత – జనజీవనం అస్తవ్యస్తం

అండర్ పాస్‌ల‌లో నిలిచిన నీరు
రోడ్లన్నీ జలమయం
ప‌లు విమానాల దారి మళ్లింపు
స్కూళ్లు, కాలేజీలకు సెలవు
వర్షంలో రోడ్డు ప్రమాదం..
బైక్​ ప్రమాదం తప్పించుకోబోయి మహిళ మృతి

ఆంధ్రప్రభ స్మార్ట్, బెంగళూరు: బంగాళాఖాతంలో ఏర్ప‌డ్డ ‘దానా’ తుపాను ఏపీలోని రాయలసీమ, కర్నాటక రాజధాని బెంగళూరుపై తీవ్ర ప్రభావం చూపుతోంది. సోమవారం రాత్రి నుంచే ఈ ప్రాంతాల్లో కుంభవృష్టి కురుస్తోంది. బెంగళూరు సిటీని భారీ వర్షం ముంచెత్తింది. నగరంలోని పలు రహదారులపై నీరు నిలిచి చెరువుల్లా మారాయి. పలు విమానాలు ఆలస్యంగా నడిచాయి. మరో వైపు వర్షాల కారణంగా ఓ మహిళ చనిపోయింది. సోమవారం రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షానికి బెంగళూరు అస్తవ్యస్తంగా మారింది. ముఖ్యంగా బెంగళూరు ఎయిర్​పోర్టు రోడ్డు దగ్గర పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. భారీ వర్షాల కారనంగా విమాన రాకపోకలపై తీవ్ర ప్రభావం పడింది. బెంగళూరు విమానాశ్రయంలో గందరగోళం నెలకొంది. 20విమానాలు ఆలస్యంగా నడిచాయి. ఢిల్లీ నుంచి వచ్చిన ఎయిర్ ఇండియా విమానం, నాలుగు ఇండిగో విమానాలను చెన్నైకి దారి మళ్లించారు.

రైల్వై అండర్​పాస్​లలో నీరు..

ఎయిర్ పోర్టు రోడ్డులో ట్రాఫిక్ రద్దీతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. దాదాపు 2 గంటల పాటు ట్రాఫిక్ స్తంభించింది. వాహన చోదకులు వర్షంలో తడిసిపోయారు. సోమవారం రాత్రి 9 గంటల వరకు ఉత్తర శివారు దేవన హళ్లిలోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో పరిస్థితులు మారిపోయాయి. యలహంకతో పాటు ఉత్తర బెంగళూరులోని సహకార్ నగర్ తదితర ప్రాంతాల్లో సోమవారం రాత్రి కుండపోత వర్షం కురిసింది. మాల్ ఆఫ్ ఆసియా సమీపంలోని సహకార్ నగర్లోని రైల్వే అండర్ పాస్ నీట మునిగిపోయింది. ఫలితంగా పలు కార్లు సైతం మునిగాయి.

స్కూళ్లు, కాలేజీలకు సెలవు..

- Advertisement -

బెంగళూరులోని సర్జాపూర్ ప్రాంతంలో గుంతలను దాటుతూ వెళ్తుండగా మల్లిక అనే మహిళ మృతి చెందింది. తన భర్త మునిరాజుతో కలిసి బైక్​పై వెళ్తుండగా రోడ్డు ప్రమాదం నుంచి తప్పించుకునే క్రమంలో బండిని స్లో చేశారు. ఇంతలో ఓ మినీ ట్రక్కు వారిని ఢీకొట్టింది. దీంతో ఆ మహిళ చనిపోయింది. మంగళవారం పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు సెలవు ప్రకటించారు. బెంగళూరులో వర్షాల కారణంగా పాఠశాలలు మూతపడటం వారంంలో ఇది రెండోసారి. నగరంలో పలు చెట్లు కూలడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈశాన్య బెంగళూరు ట్రాఫిక్ పోలీస్ ఏసీపీ తెలిపిన వివరాల ప్రకారం కోగిలు జంక్షన్ నుంచి ఐఏఎఫ్ వైపు వెళ్లే సర్వీస్ రోడ్డును మూసివేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement