ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రాష్ట్రాల్లో భారీ వర్షాలు అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది. తెలంగాణలో ఇప్పటికే అక్కడక్కడ మోస్తరు నంఉచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో మూడు రోజుల వరకు అంటే.. 18వ తేదీ వరకూ భారీ వర్ష సూచన ఉందని వాతావరణ విభాగం (IMD) అధికారులు అంచనా వేశారు. ఆంధ్రప్రదేశ్‌లోనూ ఆదివారం నుంచి 18వ తేదీ వరకు భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు అంచనా వేశారు. ముఖ్యంగా కోస్తాంధ్ర ప్రాంతంలో భారీ వర్షాలు కురిసేందుకు అనుకూల వాతావరణం ఉన్నట్టు వెల్లడించారు.
ఇక.. దేశవ్యాప్తంగా మాన్‌సూన్ సీజన్ స్పీడందుకుందని, ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌కి భారీ నుంచి అతి భారీ వర్ష సూచన ఉందని వాతావారణ విభాగం తెలిపింది. జులై 17న ఉత్తరాఖండ్‌లో అత్యంత భారీ వర్షం కురవవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. అలాగే.. కర్ణాటకలో 18, 19వ తేదీ వరకూ భారీ వర్షాలు కురుస్తాయని IMD అంచనా వేసింది.