తమిళనాడులో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం 8 జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. చెన్నై, కాంచీపురం, చెంగల్పట్టు, విల్లుపురంతోపాటు మరో 7 జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. అదేవిధంగా చెన్నైలోని సబ్ వేలను అధికారులు మూసివేశారు. హెల్ప్ లైన్ సెంటర్ లో వస్తున్న ఫిర్యాదులను సీఎం స్టాలిన్ పరిశీలించారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పలు చోట్ల భారీ వృక్షాలు కూలిపోవడంతో కార్లు ధ్వంసమయ్యాయి. ఇదిలా ఉంటే మరో 24 గంటల పాటు తమిళనాడులో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో ప్రజలు, అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని అక్కడి ప్రభుత్వం సూచించింది.
నెల్లూరులో ఎడతెరిపి లేని వాన..
ఉమ్మడి నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉదయగిరి, ఆత్మకూరులో భారీగా పంట నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. సోమశిల, కండలేరు జలాశయాలు నిండుకుండలా మారాయి.