Thursday, November 21, 2024

మరో రెండు రోజులు భారీవర్షాలు.. ఒడిశా, బెంగాల్‌లకు ఎల్లో అలెర్ట్‌

రాబోయే రెండు, మూడు రోజుల పాటు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత మెట్రోలాజికల్‌ విభాగం (ఐఎండీ) ఆదివారం హెచ్చరించింది. మరో నాలుగు రోజుల పాటు ఉత్తరాఖండ్‌లోని ఐదు జిల్లాలకు ఐఎండీ ఎల్లో అలెర్ట్‌ జారీ చేసింది. ఉత్తరాఖండ్‌ లోని పిథోరాగార్గ్‌, డెహ్రాడూన్‌ జిల్లాల్లో భారీవర్షాలు కురుస్తాయని ప్రకటించింది. గంగోత్రి, యమునోత్రి, డెహ్రాడూన్‌లో భారీ వర్షాలు కొనసాగనాగుతయాని ప్రకటించింది. హెల్గ్యు గాడ్‌ వద్ద గంగోత్రి హైవేను అధికారులు మూసివేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్‌ సింగ్‌ ధమి వర్షాభావ జిల్లాల్లో ఆదివారం ఏరియల్‌ సర్వే నిర్వహించారు.

ఒడిషా, పశ్చిమబెంగాల్‌ లో రానున్న రెండు రోజుల్లో ఒడిషా, పశ్చిమబెంగాల్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ ప్రకటించింది. ఈ ప్రభావం ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిషా తీర ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటుందని ప్రకటించింది. ఈనెల 14 వరకు ఒడిషా, పశ్చిమబెంగాల్‌ రాష్ట్రాల్లో అతిభారీ వర్షాలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. అంతేకాదు, తమిళనాడు, పుదుచ్చేరి, గుజరాత్‌ రాష్ట్రాల్లో కూడా సోమ, మంగళవారాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది.

rains

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement