హైదరాబాద్, ఆంధ్రప్రభ: తెలంగాణలో రాగల మూడు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మూడు రోజులపాటు రాష్ట్రంలో పలు జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. రాష్ట్ర వ్యాప్తంగా గురువారం పలు జిల్లాల్లో భారీ వర్షాలతోపాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు ఉంటాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఆదిలాబాద్, కొమరం భీం ఆసీఫాబాద్ , మంచిర్యాల, నిర్మల్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేశారు.
15వ తేదీన తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆదిలాబాద్, కొమరంభీం ఆసీఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది. భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉన్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ముఖ్యంగా బయటకు వెళ్లే సమయాల్లో తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించింది. దూర ప్రయణాలు చేసే వారు మరింత జాగ్రత్తగా ఉండాలని తెలిపింది.