బ్రెజిల్‌లో వర్షాలు, వరదల ధాటికి జనం ఆగమాగం అవుతున్నారు. ఈశాన్య బ్రెజిల్‌లో కుండపోత వర్షాల కారణంగా ఇప్పటికే 44 మంది చనిపోయినట్టు అధికారులు తెలిపారు. వర్షాలు, వరదల ధాటికి వందలాది మంది గల్లంతయినట్టు తెలుస్తోది. భారీ వర్షాలతో దాదాపు పదుల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారని బ్రెజిల్ ప్రభుత్వం ప్రకటించింది. వరదల కారణంగా 3,957 మంది ఆశ్రయం కోల్పోయినట్లు ప్రభుత్వం తెలిపింది.
ఇక.. బ్రెజిల్‌లో కురుస్తున్న వర్షాలకు కొండచరియలు విరిగిపడటంతో పాటు వరదలు వచ్చాయి. భారీ వర్షాల కారణంగా బ్రెజిల్ దేశంలోని నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. దాదాపు 1,200 మంది సిబ్బంది సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. ఏటా బ్రెజిల్‌లో వర్షాల ధాటికి వందలాది మంది బ్రెజిలియన్లు చనిపోతున్నారు.