Saturday, November 16, 2024

TG | భారీ వర్షాలు… 20లక్షల ఎకరాల్లో పంట నష్టం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. పలు ప్రాంతాల్లో వరదకు లక్షల ఎకరాల్లో వరి, పత్తి తదితర పంటల కొట్టుకుపోగా మరిన్ని లక్షలాది ఎకరాల్లో పంట నీట మునిగింది. శని, ఆదివారాల్లో కురిసిన భారీ వర్షాలకు తెలంగాణ వ్యాప్తంగా పంట నష్టం దాదాపు20 లక్షల ఎకరాల వరకు ఉంటుందని వ్యవసాయశాఖ ప్రాథమిక అంచనాకు వచ్చినట్టు తెలుస్తోంది.

ప్రస్తుతం వరి పిలక దశలో ఉండడం, పత్తి పూత దశలో ఉండడంతో భారీ వర్షాలు పంటలకు తీవ్ర నష్టాన్ని కలిగించాయని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మరీ ముఖ్యంగా రాష్ట్రంలో దాదాపు 50లక్షల ఎకరాల్లో సాగైన పత్తి పంట భారీ వర్షాలకు నష్టపోయేప్రమాదముందని హెచ్చరిస్తున్నారు.

పత్తి చేలల్లో నీరు నిలిచి మొక్కలు ఎరుపుబారి ఎండిపోయేప్రమాదముందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. భారీ వర్షాలకు పత్తి గూడ రాలిపోతోంద ని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది వానాకాలంలో రాష్ట్ర వ్యాప్తంగా 1.10 కోట్ల ఎకరాల్లో వివిధ పంటలు సాగుయ్యాయి.

అత్యధికంగా దాదాపు 49లక్షల ఎకరాల్లో వరి, 43లక్షల ఎకరాల్లో పత్తి సాగయింది. ఇక మొక్కజొన్న 4.88 లక్షల ఎకరాలు, కంది 4.60లక్షల ఎకరాల్లో, సోయాబిన్‌ 3.84లక్షల ఎకరాల్లో సాగు అవుతోంది. భారీ వర్షాలకు మహబూబాబాద్‌, ములుగు, ఖమ్మం, నల్గొండ, నాగర్‌కర్నూలు, మహబూబ్‌నగర్‌, హన్మకొండ, భద్రాద్రికొత్తగూడెం, జనగామ జిల్లాల్లో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement