హైదరాబాద్, ఆంధ్రప్రభ: తెలంగాణ వ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు బలపడ్డాయి. ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్త్తున్నాయి. రాష్ట్రంలో రాబోయే మూడు రోజులు… మంగళ, బుధ, గురువారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. తెలంగాణలోని పలు జిల్లాల్లో సోమవారం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. తూర్పు పశ్చిమ ద్రోణి మధ్యప్రదేశ్ నుంచి పiశ్చిమ బంగాళాఖాతం వరకు చత్తీస్‌గడ్, దక్షిణ ఒడిశా మీదుగా సముద్ర మట్టం నుంచి 1.5కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోందని వివరించింది.
అంతర్గత ఒడిశా, దాని పరిసరాల్లోని ఉపరితల ఆవర్తనం ఇప్పుడు దక్షిణ ఒడిశా, దాని పరిసరాల్లో సముద్ర మట్టానికి 3.1కిలోమీటర్ల ఎత్తులో ఉందని తెలిపింది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలోని కుమ్రంభీం ఆసీఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, కామారెడ్డి, హనుమకొండ, జయశంకర్ భూపాలపల్లి, నల్లగొండ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. మంచిర్యాల, ఆదిలాబాద్, కామారెడ్డి, సిద్ధిపేట, వరంగల్ తదితర ప్రాంతాల్లో మోస్తారు వర్షపాతం నమోదైంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.