Friday, November 22, 2024

TS | ఇటు ఈదురుగాలు.. అటు వడగళ్లు.. కుమ్మేస్తొన్న వర్షం..

తెలంగాణలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం ప్రారంభమైంది. ఆకాశం మేఘావృతమై ఒక్కసారిగా వర్షం కురవడం ప్రారంభమైంది. పలు ప్రాంతాల్లో సాయంత్రం ఐదు గంటలకే చీకట్లు అలుముకున్నాయి. తెలంగాణలో ఉమ్మడి కరీంనగర్, కుమురంబీమ్ అసిఫాబాద్, ములుగు, జనగామ సహా పలు జిల్లాల్లో ఈదురుగాలులు, ఉరుములతో కూడిన వర్షం కురిసింది.

హైదరాబాద్‌ జంట నగరాల పరిధిలోని పలుచోట్ల ఉరుములు, మెరుపులతో ఒక్కసారిగా వర్షం ప్రారంభమైంది. కూకట్‌పల్లి, నిజాంపేట, కేపీహెచ్‌బీ, లిగంపల్లి, కొండాపూర్‌ తో పాటు… జూబ్లీహిల్స్, మాదాపూర్, పంజాగుట్ట, బంజారాహిల్స్‌, గచ్చిబౌలి, రాయదుర్గంలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కుమ్మేస్తొంది. మియాపూర్‌లో పలుచోట్ల వడగళ్ల వాన కురిసింది.

ఇక సికింద్రాబాద్‌, బోయినపల్లి, తిరుమలగిరి, అల్వాల్‌, ప్యారడైజ్‌, మారేడ్‌పల్లి, హబ్సిగూడ, నాచారం, మల్లాపూర్‌, సుచిత్ర, జీడిమెట్ల, బహదూర్‌పల్లి, పేట్‌బషీరాబాద్‌ మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లా పరిధిలోని పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి., రోడ్లపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు.

కుప్పకూలిన రేవంత్ రెడ్డి ప్రచార సభ టెంట్లు..

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొనాల్సిన కాంగ్రెస్ జనజాతర సభ కోసం కరీంనగర్‌లోని ఎస్ఆర్ఆర్ డిగ్రీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన టెంట్లు కుప్పకూలాయి. ఈదురుగాలుల ధాటికి కుర్చీలు చెల్లాచెదురయ్యాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement