Saturday, September 21, 2024

TG | హైదరాబాద్‌లో ప‌లు చోట్ల భారీ వ‌ర్షం..

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. సాయంత్రం ఒక్కసారిగా మేఘాలు కమ్ముకుని భారీ వర్షం మొదలైంది. అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. నగరంలోని పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, యూసుఫ్ గూడ, అమీర్ పేట్, కూకట్ పల్లి, నిజాంపేట్, మాదాపూర్, హిమాయత్ నగర్, లఖ్డీకాపూల్, శేరిలింగంపల్లి, మియాపూర్‌, కుత్బుల్లాపూర్‌, బాలానగర్‌, ఖైరతాబాద్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. వర్షపు నీరు రోడ్లపైకి చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement