Thursday, September 12, 2024

TG | హైదరాబాద్‌లోని ప‌లు ప్రాంతాల్లో భారీ వర్షం!

హైదరాబాద్‌లో ఈరోజు (ఆగస్టు 20) సాయంత్రం భారీ వర్షం మొదలైంది. దట్టమైన మేఘాలు కమ్ముకుని భారీ వర్షం ప్రారంభమైంది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలోని కుత్బుల్లాపూర్, కూకట్ పల్లి, శేరిలింగంపల్లి, నిజాంపేట్, మియాపూర్, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్, పంజాగుట్ట, అమీర్ పేట్, మహదీపట్నం, షేక్ పేట్, ఆసిఫ్ నగర్, కాప్రా త‌దిత‌ర‌ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

ఇప్పటికే కురుస్తున్న వర్షాలకు రోడ్లన్నీ జలమయ్యాయి. ఇక ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే సమయం కావడంతో రోడ్లపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement