Wednesday, November 20, 2024

భారీ వర్షం ఆగిన బొగ్గు ఉత్పత్తి..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. దీంతో ఉపరితల గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. 5 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయిందని అధికారులు తెలిపారు. జిల్లాలో గడిచిన 24 గంటలుగా ఎడతెరిపి లేని ముసురు కురుస్తున్నది. కిన్నెరసాని, తాలిపేరు, సింగభూపాలం, మూకమామిడి, పెద్దవాగు ప్రాజెక్టులకు వరద పోటెత్తుతున్నది. జిల్లాలో సగటున 32.5మీల్లిమీటర్ల వర్షపాతం నమోదైంది. కొత్తగూడెం మండలంలో అత్యధికంగా 68.2 మి.మీ వర్షం కురిసింది. వర్షం కారణంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతుండటంతో పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.

ఇది కూడా చదవండి: పాతబస్తీలో భాగ్యలక్ష్మీ అమ్మవారిని దర్శించుకున్న పీవీ సింధు

Advertisement

తాజా వార్తలు

Advertisement