Friday, October 18, 2024

TG | హైదరాబాద్‌లో భారీ వర్షం !

హైద‌రాబాద్ న‌గ‌రంలో నేడు (శుక్ర‌వారం) సాయంత్రం ప‌లు చోట్ల భారీ వ‌ర్షం కురిసింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట‌, ఫిల్మ్ న‌గ‌ర్, సోమాజిగూడ‌, కొండాపూర్, బేగంపేట్, సికింద్రాబాద్, కుత్బుల్లాపూర్, కూక‌ట్‌ప‌ల్లి, అమీర్‌పేట‌, మాదాపూర్, హైటెక్ సిటీతో పాటు ప‌లు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వ‌ర్షం కురిసింది.

వర్షం కారణంగా ట్రాఫిక్ కు అంత‌రాయం క‌లిగింది…. రోడ్లపై ఉన్న వాహనదారులు తడిసి ముద్దయిపోయారు. కాగా, రాగల మూడురోజులు సైతం వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement