Tuesday, November 26, 2024

Rain alert | ఏపీ, తెలంగాణ‌ లకు భారీ వర్షసూచన.. బంగాళాఖాతంలో అల్పపీడనం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఈ నెల 15 నాటికి అల్పపీడనంగా మారనుందని, దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఒకటి, రెండు రోజుల్లో ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనున్నట్లు వెల్లడించింది. దీంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడే అవకాశం ఉందని పేర్కొంది. ప్రస్తుతం బంగాళాఖాతం ఆగ్నేయం, నైరుతి దిశగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారడానికి అనుకూల వాతావరణం నెలకొని ఉందని వివరించింది. నవంబర్‌ 15వ తేదీ నాటికి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement