దేశంలోని పలు రాష్ట్రాల్లో మూడురోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతోందని, దీని ప్రభావంతో పలు రాష్ట్రాల్లో అకాల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ సందర్భంగా గుజరాత్, మహారాష్ట్ర తీర ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది.
వచ్చే వారం దక్షిణ రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. శని, ఆదివారాల్లో మహారాష్ట్రలోని థానే, పాల్ఘర్, రాయ్‌గఢ్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. అలాగే, హిమాచల్ ప్రదేశ్‌లోని కొన్ని చోట్ల ఆదివారం వర్షం, మంచు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంది.