ఢిల్లీ ఎయిర్ పోర్టుల్లో భారీగా బంగారం పట్టుబడింది. ఎయిర్ పోర్టులో ఒక విదేశీ ప్రయాణికుడి నుంచి రెండు కోట్ల విలువైన బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా 75 లక్షల విలువైన విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. షార్జా నుంచి వస్తున్న ఒక ప్రయాణికుడి నుంచి ఈ బంగారాన్ని, విదేశీ కరెన్సీని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అదే సమయంలో ముంబయి ఎయిర్ పోర్టులోనూ దాదాపు రెండు కోట్ల విలువైన విదేశీ కరెన్సీని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సూడాన్ నుంచి వస్తున్న నలుగురు ప్రయాణికుల నుంచి ఈ విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని కస్టమ్స్ అధికారులు ప్రశ్నిస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..