Monday, November 18, 2024

భారమైన గ్యాస్‌.. సబ్సిడీ ఎత్తివేసిన ప్రభుత్వం

కేంద్ర ప్రభుత్వం గృహ వినియోగ గ్యాస్‌ సిలిండర్‌ ధరలు పెంచుకుంటూ పోతోంది. సబ్సిడీని పూర్తిగా ఎత్తి వేసింది. కేవలం ఉజ్జ్వల్‌ పథకంలో ఉన్న వారికి మాత్రమే సబ్సిడీ ఇస్తామని ప్రకటించారు. మన దేశంలో జులై 1 నాటికి గ్యాస్‌ వినియోగదారులు 30 కోట్ల 95 లక్షల మంది ఉన్నారు. వీరిలో 2 కోట్ల 11 లక్షల (7 శాతం) మంది 2022లో ఇప్పటి వరకు గ్యాస్‌ సిలిండర్లను తీసుకోలేదు. ఈ వినియోగదారులు సిండర్లను బుక్‌ చేసుకోలేదని కేంద్ర పెట్రోలియం, నేచురల్‌ గ్యాస్‌ శాఖ మంత్రి రామేశ్వర్‌ తేలీ లోక్‌సభలో వెల్లడించారు. ఇందుకు చాలా కారణాలు ఉన్నాయని ఆయన తెలిపారు. ధరల పెరుగుదల, కుటుంబ సభ్యుల సంఖ్య, తేలిగ్గా లభించే కట్టెలు, ఆహార అలవాట్లు వంటివి కారణమని ఆయన వివరించారు.

పెరుగుతున్న గ్యాస్‌ ధరలు..

సాధారణంగా గ్యాస్‌ ధరలను సౌదీ కాంట్రాక్ట్‌ ప్రైస్‌ (సీపీ) ఆధారంగా నిర్ణయిస్తారు. పైపుల ద్వారా సరఫరా చేసే గ్యాస్‌ను మాత్రం సిటీ గ్యాస్‌ డిస్ట్రిబ్యూషన్‌ (సీజీడీ) నిర్ణయిస్తుంది. ప్రభుత్వం గ్యాస్‌పై ఇస్తున్న సబ్సిడీని పూర్తిగా తగ్గించి, వాస్తవ రేట్లకు తీసుకు వ చ్చింది. దీని వల్ల సామాన్య, మధ్య తరగతి వారు క్రమంగా గ్యాస్‌కు దూరం అవుతున్నారు. మంత్రి లోక్‌సభలో చెప్పిన విధంగా చాలా మంది గ్యాస్‌ వినియోగదారులు మళ్లి కట్టెల పొయ్యిలనే నమ్ముకుంటున్నారు. ఫలింగా 2 కోట్ల 11 లక్షల మంది గ్యాస్‌కు దూరం అయ్యారు. ఈ సంఖ్య మరింత పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

తగ్గుతున్న వినియోగం..

దేశంలో గ్యాస్‌ వినియోగం తగ్గుతుందని మంత్రి లోక్‌సభలో వెల్లడించారు. 2022లో గ్యాస్‌ వినియోగం 140.93 కోట్ల మేర ఉంది. 2021లో ఇది 156.76 కోట్లు, 2020లో 143.92 కోట్లు, 2019లో 132.63 కోట్ల రూపాయాల గ్యాస్‌ను ఉపయోగించారని మంత్రి వివరించారు.

- Advertisement -

ఉజ్జ్వల యోజన స్కీమ్‌..

ప్రధాన మంత్రి ఉజ్జ్వల యోజన 2016లో ప్రారంభించారు. ఈ స్కీమ్‌లో పేదలైన మహిళలకు ఉచితంగా గ్యాస్‌ కనెక్షన్‌ ఇచ్చారు. 2019 నాటికి ఈ స్కీమ్‌లో 8 కోట్ల గ్యాస్‌ కనెక్షన్లు ఇచ్చారు. ఈ స్కీమ్‌ రెండో దశలో గ్యాస్‌ కనెక్షన్‌తో పాటు, మొదటి సిలిండర్‌, స్టౌవ్‌ను ఉచితంగా అందించారు. 2022, జులై 1 నాటికి ఆయిల్‌ కంపెనీలు కోటి 35 లక్షల ఎల్‌పీజీ గ్యాస్‌ కనెక్షన్లు జారీ చేశాయి. 2022-23 సంవత్సరంలో గ్యాస్‌ సిలిండర్‌పై 200 సబ్సిడీ ఇస్తామని కెెంద్రం ప్రకటించింది. సంవత్సరానికి 12 సిలిండర్లకు మాత్రమే ఈ సబ్సిడీ వర్తిస్తుందని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఎల్‌పీజీ గ్యాస్‌ సిలెండర్‌ ధర 1100 రూపాయాలకుపైగానే ఉంది. పేదలకు ఇందులో లభించే సబ్సిడీ కేవలం 200 రూపాయలు మాత్రమే. ప్రధాన మంత్రి ఉజ్జ్వల యోజన స్కీమ్‌లో ఉన్న లబ్దిదారులు కూడా సిలిండర్‌కు 900 పైగా ధర చెల్లించాల్సి వస్తోంది. ఫలితంగానే పేదలు ఈ భారం భరించలేక.. గ్యాస్‌ వినియోగానికి దూరం అవుతున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement