Saturday, November 23, 2024

జంట జలాశయాలకు భారీ వరద…

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : భారీ వర్షాలకు హైదరాబాద్‌లోని జంట జలాశయాలతో భారీగా వరద వచ్చి చేరుతోంది. ఉస్మాన్‌సాగర్‌కు 2వేల క్యూసెక్కుల వరద కొనసాగుతోంది. దీంతో అధికారులు 2 గేట్ల ద్వారా 832 క్యూసెక్కుల నీటిని మూసీ నదిలోకి విడుదల చేస్తున్నారు. ఉస్మాన్‌సాగర్‌ ప్రస్తుత నీటిమట్టం 1786.65 అడుగులు కాగా పూర్తిస్థాయి నీటిమట్టం 1790 అడుగులకు నీటి మట్టం చేరింది.

గరిష్టస్థాయికి హుస్సేన్‌సాగర్‌ నీటిమట్టం..

భారీ వర్షాలతో హుస్సేన్‌సాగర్‌ మరోసారి గరిష్ట నీటిమట్టాన్ని తాకింది. సాగర్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 513. 43 మీటర్లు కాగా… ప్రస్తుతం 513. 70 మీటర్లుగా ఉంది. పూర్తిస్థాయి నీటిమట్టం దాటడంతో అధికారులు తూముల ద్వారా వరద నీటిని దిగువకు వదులుతున్నారు.

మూసీకి కొనసాగుతున్న వరద…

మూసీ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. హైదరాబాద్‌లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో నది ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో అధికారులు ఏడు గేట్లను రెండు అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 8764.52 క్యూసెక్కుల నీరు వస్తుండగా… 12,099.18 క్యూసెక్కుల వరద బయటకు వెళ్తోంది. మూసీ పూర్తిస్థాయి సామర్థ్యం 645 అడుగులు కాగా… ప్రస్తుతం 641.25 అడుగులకు చేరింది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 4.46 టీఎంసీలు కాగా… ప్రస్తుతం 3.33 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement