Saturday, November 2, 2024

TG | సాగర్ కు భారీ వ‌ర‌ద‌… 24 గేట్ల ఎత్తివేత..

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, న‌ల్ల‌గొండ : నాగార్జునసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండింది. దీంతో అధికారులు 24 గేట్లను ఎత్తి 2,35, 298 క్యూసెక్కుల నీటిని దిగువ ప్రాంతానికి విడిచి పెడుతున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 590 అడుగులకు గాను ప్రస్తుతం నీటి నిల్వ‌ 589.50 అడుగులకు చేరుకుంది.

ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతం నుండి 1,52,298 క్యూసెక్కుల వరదనీరు వస్తుండగా క్రస్ట్ గేట్లతో పాటు, వివిధ అవసరాల నిమిత్తం ప్రాజెక్టు నుండి అధికారులు 2,35, 298 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. కుడి కాలువ‌ 8452 క్యూసెక్కులు, ఎడమ కాలువ ద్వారా 2712 క్యూసెక్కులు, పవర్ హౌస్ కు 28,582 క్యూసెక్కులు, ఏఎంఆర్పి ద్వారా 1800 క్యూసెక్కులు, ఎల్ఐసీ ద్వారా 600 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement