Thursday, September 5, 2024

In Flow | జూరాలకు భారీ వరద.. శ్రీశైలం దిశగా కృష్ణమ్మ పరుగులు

జూరాల ప్రాజెక్టులోకి 3,02,000 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టు నుంచి విద్యుత్ ఉత్పత్తి మాత్రం చేస్తున్నారు.. అదే విధంగా నెట్టెంపాడు, పార్లల్ కెనాల్ కోసం నీటిని విడుదల చేసారు. మొత్తం ప్రాజెక్టు నుంచి 44 గేట్లను ఎత్తి 3,16,308 క్యూసెక్కుల నీటిని శ్రీశైలం వైపు దిగువకు విడుదల చేశారు.

నెట్టెంపాడుకు 750 క్యూసెక్కులు, భీమా లిఫ్ట్ 1,300, కుడి 453, ఎడమ కాల్వలకు 820 క్యూసెక్కులతోపాటు విద్యుత్ ఉత్పత్తికి సరిపడా నీరు విడుదల చేసినట్లు ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు అధికారులు శ‌నివారం తెలిపారు. జూరాల ప్రాజెక్టు కేపాసిటీ 6.2 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటిమట్టం ల నీటి మట్టం ఈ రోజు సాయంత్ర 6 గంట‌ల‌కు 4.033 టీఎంసీలుగా ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement