కృష్ణానదిపై ఉన్న జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. ఎగువనుంచి జూరాల జలాశయానికి 1,45,000 క్యూసెక్కుల వరద వస్తున్నది. దీంతో అధికారులు ప్రాజెక్టు 25 గేట్లు ఎత్తి 1,39,590 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టుకు 1,69,206 క్యూసెక్కుల వరద వస్తున్నది. దీంతో అధికారులు 4 గేట్లను 10 అడుగుల మేరఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు నుంచి మొత్తం 1,75,043 క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్తున్నది. ఇక నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు 1.62 లక్షల క్యూసెక్కుల నీరు వస్తున్నది. అంతేమొత్తంలో దిగువకు వెళ్తున్నాయి.
Advertisement
తాజా వార్తలు
Advertisement