Friday, November 22, 2024

ఎగువ నుంచి వస్తున్న భారీ వరద.. మళ్లీ ప్రమాద స్థాయిని దాటిన యమునా నది..

హిమచల్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో హర్యానాలోని హత్నికుండ్ బ్యారేజీకి వరద నీరు పోటెత్తుతోంది. హర్యానాలోని హత్నికుండ్ బ్యారేజీ నుంచి దిగువకు దాదాపు దీంతో 2 లక్షల క్యూసెక్కుల నీటిని వ‌ద‌ల‌డంతో యమునా నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో యమునా నదిలో నీటిమట్టం మళ్లీ తారస్థాయిని చేరింది. ముఖ్యంగా ఢిల్లీలో యమునా నది మళ్లీ 205.33 మీటర్ల ప్రమాద స్థాయిని దాటింది.

- Advertisement -

ఇవ్వాల ఉదయం 10 గంటల స‌మ‌యంలో నదిలో 206.10 మీటర్ల నమోద‌వ్వ‌గా.. ఇది సాయంత్రానికి 206.31 మీటర్లకు పెరగింది. ఈనేపథ్యంలో కేజ్రీవాల్ సర్కార్ అప్రమత్తమైంది.. అంతేకాకుండా హిండన్ నది నీటిమట్టం పెరగడం వల్ల నోయిడాలోని లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా నదీ పరివాహాక ప్రాంతాల ప్రజలను అధికారులు తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement