Friday, November 22, 2024

హర్మన్‌ప్రీత్‌ కౌర్‌కు భారీ జరిమానా

బంగ్లాదేశ్‌తో టైగా ముగిసిన మూడో వన్డేలో ఫీల్డ్‌ అంపైర్‌ నిర్ణయాన్ని తప్పుపడుతూ వికెట్లను బ్యాట్లతో కొట్టిన టీమిండియా మహిళా కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌పై ఐసీసీ కొరడా ఝలిపించింది. హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ మ్యాచ్‌ ఫీజులో 75శాతం కోత విధించడంతోపాటు మూడు డీమెరిట్‌ పాయింట్లు కేటాయించే అవకాశం ఉంది. హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ ప్రవర్తనను లెవెల్‌-2 తప్పిదంగా గుర్తించిన ఐసీసీ కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమైనట్లు సమాచారం.

యోచ్‌ ఆఫీషియల్‌ భారత కెప్టెన్‌ తీరును లెవల్‌ 2 నేరంగా పరిగణించాడు. అందుకుని ఆమెకు 75శాతం ఫైన్‌తో పాటు నాలుగు డీమెరిట్‌ పాయింట్లు కేటాయించాడు. ‘మైదానంలో (వికెట్లను బ్యాట్‌తో కొట్టడం) అలా ప్రవర్తించినందుకు హర్మన్‌ప్రీత్‌కు మ్యాచ్‌ ఫీజులో 50 శాతం, అలాగే సిరీస్‌ ప్రదాన కార్యక్రమంలో అంపైర్లను తప్పుపట్టినందుకు మరో 25 శాతం ఫైన్‌ విధించాం. దురుసు ప్రవర్తనకు గానూ 3, ప్రజెంటేషన్‌ సమయంలో అలా మాట్లాడినందుకు ఒక డీమెరిట్‌ పాయింట్లు కేటాయించాం’ అని మ్యాచ్‌ అధికారి పేర్కొన్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement