దేశ రాజధాని ఢిల్లీలో భారీ భూకంపం సంభవించింది. ఢిల్లీతోపాటు ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో భూప్రకంపనలు వచ్చాయి. ఢిల్లీ-ఎన్‌సీఆర్, పంజాబ్, హర్యానా సహా ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో మధ్యాహ్నం 2 గంటల 25 నిమిషాల సమయంలో భూమి కంపించింది.
రిక్టర్ స్కేల్‌పై భూకంపం తీవ్రత 6.2గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (ఎన్‌సీఎస్) తెలిపింది. ఎన్‌సీఎస్ ప్రకారం భూకంపం మూలం నేపాల్‌లో 5 కిలో మీటర్ల లోతులో ఉంది. భూకంపం కారణంగా ఉత్తర భారతదేశంలోని అనేక మంది ప్రజలు ఒక నిమిషం పాటు బలమైన భూప్రకంపనలను అనుభవించారు. దీంతో వారంతా తీవ్ర భయాందోళనలకు లోనయ్యారు. ఇళ్లు, ఆఫీసుల నుంచి బయటకు పరుగులు తీశారు.