బెంగళూరు ఎయిర్ పోర్టులో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. ఎయిర్‌పోర్ట్ కార్గో లో 5.3 కోట్ల విలువ చేసే 754 గ్రాముల హెరాయిన్ ను కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. దుబాయ్ నుండి బెంగుళూరు వచ్చిన ఓ పార్శిల్ లో డ్రగ్స్ గుర్తించిన కస్టమ్స్ బృందం తనిఖీలు చేసింది. కస్టమ్స్ అధికారులకు ఏమాత్రం అనుమానం రాకుండా కేటుగాళ్లు హెరాయిన్ ను ఫైల్ ఫోల్డర్ మధ్య భాగంలో దాచి ప్యాకింగ్ చేసి పార్శిల్ ద్వారా బెంగుళూరుకు పంపారు. విశ్వసనీయ సమాచారం మేరకు కార్గో లో పార్శిల్స్ పై కస్టమ్స్ అధికారులు నిఘా పెట్టారు. డ్రగ్స్ తో ఉన్న పార్శిల్ తీసుకున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. కస్టమ్స్ అధికారులు ఎన్ డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..